Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ బ్యాన్‌పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం.. ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు వీటిపై బ్యాన్ కోరింది. షియా ముస్లింలు ప్రవక్త మనవడి బలిదానం కోసం పెద్ద ఎత్తున మొహర్రం పండగను నిర్వహిస్తారు. ముస్లింలు అతని బలిదానాన్ని నిరంకుశత్వానికి ప్రతిఘటనగా భావిస్తారు. షియా ముస్లింలు మొహర్రం మొదటి పది రోజులలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఇవి ఈ నెల 9, 10 తేదీల్లో భారీ ఊరేగింపులతో ముగుస్తుంది.
Read Also: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువ. మైనారిటీ వర్గంగా ఉన్న షియా కమ్యూనిటీపై అక్కడి తీవ్రవాద సున్నీ గ్రూపులు తరుచుగా బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదులు షియాలను మత అవిశ్వాసులుగా ముద్ర వేస్తున్నారు. అయితే, వీరి నుంచి పాక్ ప్రభుత్వం భద్రతా చర్యల్ని చేపట్టింది. ఇందులో ఉగ్రవాద చర్యల్ని నియంత్రించడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా సేవలను నిలిపివేస్తోంది. మతపరమైన హింసను నిరోధించడానికి తప్పుడు సమాచారం మరియు ద్వేషపూరిత పదార్థాల వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 6 నుండి 11 వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం, ఆ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, టిక్‌టాక్ మొదలైనవాటిని పంజాబ్ ప్రావిన్స్ అంతటా సస్పెండ్ చేయాని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం కోరింది. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.