A Brave Lady Caught Snake in Office Room Video Viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాములు నీటితోపాటు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి అంటే.. ఇళ్లలోకి లేదా ఏదైనా కార్యాలయాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ చూడని పాములను మన ఇంట్లో చూస్తే ఒక్కసారిగా భయపడిపోతుంటాము. అయితే కొందరు మాత్రం పాములను చాకచక్యంగా వారి కంట్రోల్ లోకి తెచ్చుకొని వాటిని బంధించడం లాంటి సంబంధించిన వీడియోలు చాలానే చూసాం. ఇలా పాములను బంధించడం లాంటి పనులలో ఇదివరకు కేవలం మగవారిని మాత్రమే ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్య ఆడవారు కూడా ఎంతో ధైర్యంగా పాములను చాలా సులువుగా పెట్టేస్తున్నారు. తాజాగా ఇలా పాములను పట్టే వీడియో మరొకటి వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Paris Olympics 2024: మూడో రోజు వీరిపైనే ఆశలు..ఎన్నిపతకాలు రావొచ్చంటే..?
ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ లోని యువకుడిని ఒకే పాము ఏడు సార్లు పాము కాటేసిందన్న సంగతి సంబంధించిన విషయాలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే., తాజాగా మహిళ ఓ ఆఫీస్ లో ఉన్న పాము దగ్గరకు వెళ్లి చాలా సింపుల్ గా ఏదో వైర్ ను పట్టుకుని పక్కన పెట్టేసినట్లుగా.. ఓ పొడవాటి పామును చేత్తోపట్టేసుకుని సంచిలో బంధించింది. అంతేకాదండి.. ఆ పాము గురించి ఆమె లెక్చరర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పాము విషపూరితమైనది కాదని.. అది కేవలం ఎలుకల కోసమే ఇక్కడికి ప్రవేశించిందని కూడా ఆమె తెలిపింది. ఒకవేళ పొరపాటున ఈ పాము కరిస్తే మాత్రం ఎటువంటి ప్రాణాపాయం ఉండదని కూడా ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ పామును పట్టుకొని అక్కడే ఉన్న ఓ బ్యాగులో వేసి అక్కడ నుంచి దానిని పట్టుకెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఏమిటి ఇంత ధైర్యం అంటూ.. కొందరు కామెంట్ చేస్తుండగా., మరికొందరు.. దేవుడా ఆవిడ పామును ఏంటి అంత సులభంగా పట్టేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
మహాతల్లి 😅 నీకో దండం .. అంత సింపుల్ గా pic.twitter.com/6MtsjY9Csz
— CEO Voice (@CeoVoice_) July 28, 2024