కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాగా బిబిపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకున్నారు. పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావులకు వద్దకు వెళ్లారు గ్రామస్తులు.
Also Read:Astrology: ఆగస్టు 28, గురువారం దినఫలాలు
నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వరద పెరగడంతో చెరువు మధ్యలో చిక్కుకున్న తొమ్మిది మంది గ్రామస్తులు. తమను కాపాడాలని అధికారుకు సమాచారం అందించారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకుంది. చెరువులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను సిద్ధం చేసుకుని చెరువులోకి బయలుదేరింది రెస్క్యూ టీం. సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
కామారెడ్డి లో వర్షం మళ్ళీ మొదలైంది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కామారెడ్డి -హైదరాబాద్ రూట్ లో మెల్లి మెల్లిగా కదులుతున్న వాహనాలు.. కామారెడ్డి – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం.. పలు రైళ్లు రద్దయ్యాయి.. జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో నీట మునిగిన వరి మొక్క జొన్న పత్తి పంటలు.. లింగం పేట, నాగిరెడ్డి పేట, మాచారెడ్డి, సదా శివ నగర్, గాంధారి లో కోతకు గురైన రోడ్లు.. జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం లోని జీ.అర్. కాలనీ, అశోక్ నగర్, పంచముఖి హనుమాన్, కాకతీయ కాలనీ లు గోసంగి, ఇందిరా నగర్ కాలనీ లు.. లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 150 పునరావాస కేంద్రాలకు భాదితుల తరలింపు.. సత్యా గార్డెన్, ఉర్దూ భవన్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.