National Film Awards: కేంద్రం 2020 సంవత్సరానికి గానూ 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘సూరాయైపొట్రు’ ఎంపికైయింది. జాతీయ ఉత్తమ నటులుగా అజయ్ దేవ్‌గణ్, సూర్యలు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు. తానాజీ సినిమాలోని నటనకు గాను అజయ్ దేవ్‌గణ్ మూడోసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఈ సినిమా బెస్ట్ ఎంటర్టెన్మెంట్ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ విభాగంలోనూ అవార్డు గెలుచుకుంది. ఈ విభాగంలో నచికేత్ బావ్రే, మహేషా శెర్లా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఓం రౌత్ నేషనల్ అవార్డు అందుకున్నారు.
ఇక సూర్య హీరోగా నటించిన ’సూరాయైపొట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైయింది. అంతేకాదు బెస్ట్ స్క్రీన్ ప్లే శాలినీ ఉషానాయర్, సుధ కొంగర ఎంపికయ్యారు. చిత్రంలో నటించిన సూర్య ద్రౌపది ముర్ము నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు స్వీకరించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికైయింది. ఒక సినిమాలో నటించిన నటీనటులు జాతీయ ఉత్తమ నటీనటులుగా ఎంపిక కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటోంది. అప్పట్లో మణిచిత్రతాజు సినిమాలోని నటనకు గాను మోహన్‌లాల్ ఉత్తమ నటుడిగా నిలిస్తే.. శోభన ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఒకే సినిమాలోని నటీనటులు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించిన జీవీ ప్రకాశ్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో అవార్డు తీసుకున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన జ్యోతిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డు అందుకుంది.
Read also :Satyadev 26: సత్యదేవ్ కోసం రంగంలోకి దిగిన ‘పుష్ప’ విలన్!
తెలుగులో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంగీతాన్ని అందించిన థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న తెలుగు సంగీత దర్శకుల్లో కేవి మహదేవన్, రమేష్ నాయుడు, ఇళయరాజా, కీరవాణి, విద్యాసాగర్ తర్వాత తమన్ ఆరో వ్యక్తి కావడం విశేషం. గతంలో శంకరాభరణం సినిమాకు కేవి మహదేవన్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మేఘ సందేశం సినిమాకు రమేష్ నాయుడు, సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు గాను ఇళయారాజ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత అన్నమయ్య చిత్రానికి గాను కీరవాణి జాతీయ అవార్డు అందుకున్నారు.
కలర్ ఫోటో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఏకంగా ఓటీటీ వేదికగా విడుదలై అక్కడ సంచలన విజయం సాధించింది. మరోవైపు ‘నాట్యం’ సినిమాలకు బెస్ట్ మేకప్, బెస్ట్ కొరియోగ్రఫీ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.
Read also :Masooda: మూడు భాషల్లో రాబోతున్న ‘మసూద’!
2020గాను 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో 148 చిత్రాలు 20 భాషల్లో స్క్రీనింగ్‌కు ఎంపికయ్యాయి. ఈ ఇయర్ జాతీయ చలన చిత్ర అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 28 కేటగిరీలు .. 22 కేటగిరీలో నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించారు. మొత్తంగా ఉత్తమ కథా రచయత, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులను రాష్ట్రపతి అందజేశారు.