అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే గుర్తించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి కొన్నింటిని చంపేశాడు.
Read Also: Anantapur: సీఎం పర్యటన ఏర్పాట్లలో అపశృతి
అయినా ఇంకా పాములు బయటకు వస్తుండటంతో కంగారుపడ్డ ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు. వారు సిబ్బందితో రంగంలోకి దిగి.. పాములన్నింటిని పట్టుకున్నారు. వాటిని అడవిలో వదులుతామన్నారు. అయితే.. అధికారులు పాములను పట్టుకుని ఓ పెద్ద డబ్బాలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వామ్మో.. ఇన్ని పాములా? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఇల్లా? పాముల పుట్టా? అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అవన్నీ విషపూరితమైనవే అని తెలియడంతో ఇంటి యజమాని సహా స్థానికులు భయపడుతున్నారు.
Read Also: Viral Video: కదులుతున్న ఆటో టైర్‌ని మార్చిన ఓ వ్యక్తి.. అతడి ట్యాలెంట్ పై ప్రశంసలు..!
సుమారు 30 పాములను పట్టుకున్నాం.. ఈ సర్పాలు ఇంటి గోడలో తలదాచుకున్నాయి.. గోడను పగులకొట్టి పాములను బయటకుతీశాము.. వాటిని అటవీలో వదిలేశామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే.. మా ఇల్లు 1955లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాము.. ఇది రెండంతస్తుల భవనం.. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరగలేదని ఇంటి యాజమాని చెప్పాడు. ఇంత వరకు పాములు కనిపించలేదు.. ఇప్పుడు ఏకంగా 60 పాములు బయటపడటం ఇదే తొలిసారి అని ఇంటి యజమాని చెప్పుకొచ్చారు.