పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత…
ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి…
ఒడిశాలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒడిశా పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యుడికి గాయాలయ్యాయి. గరియాబంద్ జిల్లా చివరిలో ఉన్న కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సునాబేడా అభయారణ్యంలో అర్థరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో క్రాస్ ఫైరింగ్‌లో సైనికుడి మెడపై కాల్పులు జరిగాయి. దీంతో.. జవాన్ కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సైనికుడిని…
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్‌మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్‌ఎఫ్ డీఆర్‌జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్…
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.