Revanth Reddy: కేసీఆర్ ఓటుకి 10వేలు పంపాడు.. తక్కువ ఇస్తే అంగీ లాగు గుంజుకొండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కేసీఆర్ ఓటుకి రూ.10 వేలు ఎంఎల్ఏ అభ్యర్థులకు పంపారని.. తక్కువ ఇస్తే అభ్యర్థులను నిలదీయండి.. డబ్బులు ఇవ్వకపోతే అంగీ లాగు గుంజుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ క్రేన్ పెట్టినా కేసీఆర్ లేవడు అని అన్నారు. అధికారంలోక్ వచ్చేది కాంగ్రెస్ అన్నారు. కౌలు రైతులకు కూడా 12 వేలు ఇస్తుంది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతు బంధు వేయడంతో.. కౌలు రైతులు, కూలీలు, రైతులు నష్టపోతారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కె తెలివి ఉందని అనుకుంటున్నారూ అని తెలిపారు. కేసీఆర్ ఏం వేసినా తీసుకోండి.. అది మన హక్కు అన్నారు. కాంగ్రెస్ రాగానే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తోందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి.. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదు బీజేపీ అన్నారు. మళ్ళీ గెలిస్తే చర్యలు తీసుకుంటాం అంటే ఎవరు నమ్ముతారని తెలిపారు. వివేక్.. పొంగులేటి పై దాడులు దారుణమన్నారు. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు అంతటి మంచివాడు అన్నారు.
Read also: Sitaram Yechury: తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరగానే రాముడు లాంటి.. వివేక్ రావణాసురుడులాగా కనిపించాడా? అని మండిపడ్డారు. వంద ఖాతాలు ఉన్నాయని బీజేపీ గంటలో తేల్చిందన్నారు. పొంగులేటి బంధువు అయినా పాపానికి ఆర్.సురేందర్ రెడ్డి పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారన్నారు. డబ్బులు ఉన్న వాహనంలో కూర్చోపెట్టి ఫోటోలు తీసి.. కేసు పెట్టారు పోలీసులు అని మండిపడ్డారు. సంతోష్ బంధువు.. ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్.. పీయూష్ గోయల్ ఒప్పందం ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. ఏకే గోయల్ ఇంట్లో వందల కోట్లు పట్టు పడ్డాయని అన్నారు. వికాస్ రాజ్ కి మేము వందల కోట్లు ఉన్నాయని ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. కొమటిరెడ్డి.. నేను.. వంద సార్లు కాల్ చేశాం.. అయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీకి అనుబంధ విభాగం ఈడీ.. ఐటీలు అని తెలిపారు. ప్రసంగాలకు.. జరుగుతున్న తతంగాలకు పొంతనే లేదన్నారు.
Read also: Golden Horses: బంగారు గుర్రాల గురించి ఎప్పుడైనా విన్నారా?.. వీటికి పెద్ద చరిత్రే ఉంది..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కి, బీజేపీ సహకరించి..దాడులు చేస్తుందని ఆరోపించారు. ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం.. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు సహకరిస్తుందన్నారు. కేసీఆర్ ని ఓడిస్తే.. రైతులకు జనవరిలో మరో ఐదు వేల అన్నారు. కేసీఆర్ ఓటుకి..10 వేలు ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపాడని అన్నారు. తక్కువ ఇస్తే అభ్యర్థులను నిలదీయండని..అంగీ లాగు గుంజుకొవాని వ్యంగాస్త్రం వేశారు. కేసీఆర్.. 80 శాతం ఓటర్లకు.. ఒక్కో ఓటుకు 10 వేలు పంపాడని అన్నారు. బీసీ..దళిత.. మైనార్టీ బందుకు ఎందుకు అనుమతి తేలేదు కేసీఆర్? అని ప్రశ్నించారు. మిగిలిన పథకాలు కూడా రెగ్యులర్ వే కదా? అన్నారు. వాటిని ఎందుకు ఆపలేదన్నారు. మాకు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ తో పోటీ కాదన్నారు. ఈడీ,ఐటీ నే మాకు పోటీ అన్నారు. డిసెంబర్ 3న ఈడీ.. ఐటీని ఒడిస్తామన్నారు.
Dharmana Prasada Rao: అందుకే అవినీతి నిర్మూలనపై ఫోకస్ చేశాం..!
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!