Ukraine War: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఫార్మాసూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విసయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా "ఉద్దేశపూర్వకంగా" ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.
ఓ పౌరకాన్వాయ్‌పై రష్యా దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 30 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. దాదాపు 88 మంది గాయపడ్డారు.