జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. "బాధల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్‌లుగా విభజించాం. అన్ని…