Meghalaya High Court: లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 (పోక్సో) కింద మేఘాలయ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. అతని గురించి వ్యాఖ్యానిస్తూ.. 16ఏళ్ల వయసులో కుర్రాళ్లు సెక్స్ గురించి నిర్ణయం తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారాని తెలిపింది. జస్టిస్ వాన్లూరా డియెంగ్డో సింగిల్ జడ్జి బెంచ్ పిటిషన్‌ను స్వీకరించింది. నిందితుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ప్రత్యేక పోక్సో కేసును రద్దు చేసి అతన్ని విడుదల చేసింది.
Read Also:SSMB 29:మహేష్ సినిమా కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్న రాజమౌళి…
యుక్తవయస్సులో ఒకరితో ఒకరు శృంగార సంబంధాలు పెట్టుకున్న బాలికల కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా పోక్సో కింద నమోదైన కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రొమాంటిక్ రిలేషన్ షిప్ కు సంబంధించిన మ్యాటర్ ఉన్న చోట ఇలాంటి విషయాలను తెరపైకి తెచ్చే ప్రసక్తే లేదని చట్టంలో స్పష్టంగా కనిపిస్తోంది. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా.. చట్టంలో, ముఖ్యంగా పోక్సో చట్టం వంటి కఠినమైన చట్టాలలో అవసరమైన మార్పులను తీసుకురావాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. ఆ వయస్సులో ఉన్న బాల్య (సుమారు 16 సంవత్సరాల వయస్సు గల మైనర్‌ని సూచిస్తూ) శారీరక, మానసిక వికాసాన్ని పరిగణనలోకి తీసుకుని, అతను సంబంధం పెట్టుకునే నిర్ణయం తీసుకోగలడని దానిని కోర్టు సహేతుకంగా పరిగణిస్తుందని తెలిపింది.
Read Also:Jio Phone 5G: Jio 5G ఫోన్ త్వరలో లాంచ్.. ముందే లీకైన ఫీచర్లు..!
ఈ విషయం లైంగిక వేధింపుల కేసు కాదని, పూర్తిగా ఏకాభిప్రాయమని పేర్కొంటూ పోక్సో కింద నేరాలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్, బాధితురాలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. నిందితుడిని 2021లో పోక్సో కింద అరెస్టు చేశారు. జనవరి 1, 2021న, బాలిక తల్లి తరపున పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో తన కూతురిని కిడ్నాప్ చేసి లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పలు ఇళ్లలో పని చేసేవాడు. ఈ సమయంలో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ పిటిషనర్ మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు.