ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ
రంగారెడ్డి జిల్లా మీర్కాన్‌పేట్‌లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. పాసులు ఇచ్చి వారిని కార్యక్రమాలకు పిలవాలని, వారిని భాగస్వామ్యం చేస్తేనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ఫ్యూచర్ సిటీ పరిధిలోని సర్పంచ్‌లకు తప్పనిసరిగా ఆహ్వానం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక, ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రావాలనుకునే గ్రామాలు గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి కలెక్టర్‌కు పంపించాలని, సంబంధిత ఇన్‌ఛార్జి మంత్రులకు కూడా వివరాలు తెలియజేయాలని సూచించారు.
భూమి సేకరణ విషయంలో రైతులతో చర్చించి, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. మాట్లాడకుండా భూమి తీసుకుంటే అపోహలు ఏర్పడతాయని, అందుకే పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూమి ధరలు భారీగా పెరిగాయని, గతంలో ఎకరం రూ.3 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.6 కోట్లకు పెరిగిందని వివరించారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రపంచ స్థాయి నగరాలైన సింగపూర్, టోక్యో, న్యూయార్క్ సిటీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయని, కానీ ఆ ప్రాజెక్ట్ విజయవంతమైందని గుర్తుచేశారు. అదే విధంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో