Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Shortage: హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెళిశాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఇప్పటికే, హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా సీఎన్‌జీ, ఎల్‌పీజీ కొరత ఉంది. క్యాబ్‌లు, ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం లేదు. ఇటు నగరంలోనూ అటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా, డీజిల్‌కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు.. జనాలు పానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలో లీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24,000 కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్‌లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!