Food poisoning: బిర్యానీ, వాటర్‌మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- వాటర్‌మిలన్, చికెన్ బిర్యానీ కలిపి తింటే ప్రమాదమా..?
- జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్న డాక్టర్లు..
- భోజనం తర్వాత పుచ్చకాయ తినకపోవడమే బెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food poisoning: ముంబైలో నలుగురు సభ్యుల కుటుంబం రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, వాటర్‌మిలన్ తిన్న తర్వాత మరణించారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఫుడ్ పాయిజనింగ్ వల్లే వారు మరణించినట్లు భావిస్తున్నారు. దీంతో , ఇప్పుడు ప్రజలు పుచ్చకాయను విలన్‌గా చూస్తున్నారు.
నిజంగా ఈ రెండు కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా? అంటే కాదనే సమాధానం డాక్టర్ వద్ద నుంచి వస్తోంది. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. భారత్‌లో వేసవి సమయంలో వాటర్‌మిలన్ చాలా ఇష్టంగా తింటారు. వేడి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి నీరు అధికంగా ఉంటే దీనిని తినడం చాలా మంచిదిగా భావిస్తారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
Read Also: Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే, చాలా మంది భోజనం తర్వాత వాటర్‌మిలన్ తినడం వల్ల బ్లోటింగ్(కడుపు ఉబ్బరం)గా అనిపిస్తుందని చెబుతుంటారు. దీని కారణం ‘‘వాటర్ మిలన్’’. ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. కానీ భోజనంతో ముఖ్యంగా ఫ్యాట్, ప్రొటీన్ ఉన్న ఆహారం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉంటుంది. ఇదే కాకుండా వాటర్‌మిలన్‌లో ఉండే ఫ్రక్టోజ్ పులిసిపోతుంది. గ్యాస్ ఉత్పత్తి కావడం, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారి తీస్తుంది.
త్వరగా జీర్ణమయ్యే వాటర్‌మిలన్‌ను, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారంతో కలిపి తిన్నప్పుడు మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇరిటబుల్-బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు లేదా వారి సాధారణ జీర్ణక్రియ పనితీరులో సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు సాధారణ భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఏసిడిటీకి గురయ్యేవారు ఈ విధంగా తింటే కడుపు ఉబ్బరం సమస్యల్ని ఎదుర్కొంటారు. పుచ్చకాయను ఆహారంతో కలిపి తినడం కన్నా, ఆహారానికి ఆహారానికి మధ్య తింటే బెటరని డాక్టర్లు చెబుతున్నారు. పరిమితంగా తినాలి, పాల పదార్థాలు, వేయించిన ఆహారంతో తినొచ్చు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చల్లగా తినకూడదు.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు