UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- చమురు రాజకీయాల్లో భారీ కుదుపు..
- ఒపెక్, ఒపెక్+ నుంచి బయటకు వచ్చిన యూఏఈ..
- యూఏఈ నిర్ణయంతో సౌదీ అరేబియాకు భారీ ఎదురుదెబ్బ..
- ఇరాన్ యుద్ధం, చమురు సంక్షోభం వేళ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: ఇరాన్ యుద్ధం అరబ్ దేశాల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్+ నుండి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాకేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న తరుణంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.
తమ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. యూఏఈ చాలా కాలంగా ఈ రెండు కూటముల్లో భాగస్వామిగా ఉందని, అయితే ప్రపంచానికి భవిష్యత్తులో మరింత ఇంధన అవసరమవుతుందని, డిమాండ్ పెరుగుతుందని ఇంధన శాఖ మంత్రి సుహైల్ అల్ మజ్రూఈ అన్నారు. ఈ విధాన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన నిర్ణయమని యూఏఈయ భావిస్తుందని ఆయన చెప్పారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
సౌదీ అరేబియాకు భారీ దెబ్బ
ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తోంది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం చమురు ఎగుమతి చేసే కూటమి, దాని వాస్తవ నాయకుడిగా భావించే సౌదీ అరేబియాకు అతిపెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ఆ కూటమిని గందరగోళానికి గురి చేసి, దాన్ని బలహీనపరచవచ్చు. భౌగోళిక రాజకీయాలు, ఉత్పత్తి కోటాల వరకు ఒపెక్ దేశాల్లో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ, ఎప్పుడూ విభేదాలు బయటపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయా దేశాల మధ్య దూరం పెరుగుతోంది.
ట్రంప్‌కు ఆనందమే:
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టొచ్చు. ఒపెక్ చమురు ధరల్ని పెంచి ప్రపంచాన్ని దోపిడీ చేస్తోందని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా సైనిక మద్దతును ట్రంప్ చమురు ధరలతో ముడిపెట్టారు. అమెరికా ఒపెక్ దేశాలను రక్షిస్తూ, అదే సమయంలో అధిక ధరల విధించడం ద్వారా లాభం పొందుతుందని ఆయన వాదిస్తున్నారు. ఇటీవల, ఇరాన్ యుద్ధంలో ఇరాన్ తమపై దాడులు చేస్తున్న ఏ ఇతర అరబ్ దేశం కూడా తమకు పెద్దగా సహాయం చేయలేదని యూఏఈ ఆరోపించింది.
ఒపెక్ అంటే ఏమిటి.?
ఒపెక్ ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల కూటమి. 1960లో ఈ కూటమి ఏర్పడింది. చమురు ధరలు, విధానాలపై ఉత్పత్తి ఈ దేశాల నియంత్రణలో ఉంటుంది. మే 1 నుంచి ఈ కూటమిన నుంచి యూఏఈ వైదొలగడంతో ఈ సమూహలో 11 దేశాలు మాత్రమే మిగులుతున్నాయి. అవి అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!