Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: భాషలకు అతీతంగా తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరో ధనుష్. ఈ నెల 30న ఈ హీరో కొత్త సినిమా కర విడుదల కాబోతుంది. తాజాగా ఈ స్టార్ హీరో భారీ బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన ధనుష్, ఇప్పుడు హిందీ చిత్రసీమలో తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రూపొందుతున్న ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్‌లో ధనుష్ కథానాయకుడిగా నటించబోతున్నారట.
నిజానికి ఈ సినిమా గురించి వినిపిస్తున్న చాలా ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. మొదట మేకర్స్ ఈ రోల్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల చివరికి ఈ రోల్ ధనుష్‌ను వరించిందంట. ధనుష్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంలో ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘సర్దార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వాస్తవానికి భన్సాలీ నిర్మాణంలో ‘రౌడీ రాథోడ్ 2’ సినిమాను మిత్రన్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడటంతో, వీరిద్దరి కాంబినేషన్లో ఈ సరికొత్త ‘మైథలాజికల్ జంగిల్ డ్రామా’ సెట్స్ పైకి వెళ్తోందని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పటికే ‘రాంజనా’, ‘అత్రంగి రే’ వంటి సినిమాలతో మెప్పించిన ధనుష్‌కు, ఈ భన్సాలీ ప్రాజెక్ట్ హిందీలో అతిపెద్ద ప్రాజెక్ట్ కానుంది. భన్సాలీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను రిలీజ్ చేయలేదు.
Also Read
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి