AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
- ఏఐ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి కాంగ్రెస్ నిరసన..
- 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- కాంగ్రెస్ కార్యకర్తల్ని చితక్కొట్టిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్పో హాల్లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్‌నకు లొంగిపోయారని అన్నారు.
Read Also: Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ఈ సంఘటన తర్వాత, సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్లింది. పోలీస్ వర్గాల ప్రకారం, పక్కాగా ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో 10 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. అరెస్టయిన వారిలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కృష్ణహరి, నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్, బీహార్ కాంగ్రెస్‌కు చెందిన కుందన్ యాదవ్, యూపీకి చెందిన అజయ్ కుమార్ ఉన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. భారత పరువు తీసేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, ప్రదీప్ భండారి లాంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఏఐ సమ్మిట్‌కు హాజరైన సాధారణ ప్రజలు నిరసన తెలపుతున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని చితక్కొట్టారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై రాజకీయాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పరిగెత్తించారు. కాళ్లకు, చేతులకు పని చెప్పారు. కాంగ్రెస్‌కు బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Congress workers getting properly serviced by the public at the AI Summit for shaming India with utterly disgusting conduct.
Congress Leaders who orchestrated this drama should also be held accountable! pic.twitter.com/MlYRYnicKu
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 20, 2026
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!