Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paraquat Herbicide Ban: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ (Paraquat Dichloride 24% SL) గడ్డి మందు అమ్మకాలను 60 రోజుల పాటు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఈ ఏడాది మే 22న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. వెంకట నాగిరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, గడ్డి మందు సేవించి ఆత్మహత్యలు జరుగుతున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ డీజీపీ పంపిన లేఖ ఆధారంగా ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు డీలర్లకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, తమ అభ్యంతరాలు లేదా వివరణలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని పిటిషనర్ వాదించారు.
కీటకనాశన చట్టంలోని నిబంధనల ప్రకారం, వ్యవసాయంలో వినియోగించే రసాయన పదార్థం వల్ల నేరుగా ప్రమాదం ఉన్నప్పుడే నిషేధం విధించవచ్చని, ఆత్మహత్యలను కారణంగా చూపి అమ్మకాలపై నిషేధం విధించడం చట్టబద్ధం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయశాఖ ఆకస్మిక నిర్ణయం కారణంగా ప్రస్తుత సాగు సీజన్లో రైతులు కలుపు నివారణ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, భారీగా నిల్వలు ఉంచుకున్న డీలర్లకు కూడా ఆర్థిక నష్టం కలుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని, నిషేధ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో రైతులు, డీలర్లు, వ్యవసాయ రంగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!