MK Stalin: రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
- రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
- ప్రతిస్పందనగా ప్రతిపక్ష నేత వ్యూహాత్మక రిప్లై
- భవిష్యత్ పరిణామాలపై ఆసక్తి రేపుతోన్న ట్వీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-డీఎంకే బంధం చెడింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మిత్రపక్షాలు.. ఫలితాల తర్వాత తల్లకిందులయ్యాయి. టీవీకే నేతృత్వంలోని విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దీంతో డీఎంకే తీవ్ర మనస్తాపానికి గురైంది. కాంగ్రెస్ మిత్ర ద్రోహం చేసిందంటూ వెంటనే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. అంతేకాకుండా పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రక్కన సీట్లు కేటాయించొద్దని స్పీకర్‌కు లేఖ రాసింది.
ఇలాంటి తరుణంలో శుక్రవారం రాహుల్ గాంధీ 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి దేశ వ్యాప్తంగా అనేక మంది నాయకులు విషెస్ చెబుతున్నారు. ఇక మాజీ మిత్రుడైన ఎంకే.స్టాలిన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది చెప్పిన దానికి భిన్నంగా విషెస్ చెప్పారు. 2025లో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్.. “ఆలోచనల్లో సోదరుడు” అంటూ ఆప్యాయంగా సంబోధించారు. “రక్త సంబంధం కాకపోయినా భావజాలం, దూరదృష్టి, లక్ష్యాలతో మేము ఒకటిగా ఉన్నాం” అంటూ ప్రశంసలు కురిపించారు. దేశ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే ఈ ఏడాది స్టాలిన్ సందేశం పూర్తిగా అధికారిక ధోరణిలో కనిపించింది. “ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలి” అని మాత్రమే పేర్కొన్నారు. గత ఏడాది ఉన్న ఆప్యాయత ఈసారి కనిపించకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ మాత్రం స్టాలిన్‌కు సమాధానంగా సయోధ్య సంకేతాలు ఇచ్చినట్లు కనిపించారు. “భారత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, భారత భావజాలాన్ని రక్షించాలన్న మన ఉమ్మడి సంకల్పం కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ఆత్మను కాపాడే ఈ పోరాటాన్ని కలిసి కొనసాగిస్తాం” అని రాహుల్ గాంధీ తన ప్రతిస్పందనలో పేర్కొన్నారు.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ.. విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్-డీఎంకే సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎంకే కాంగ్రెస్‌తో దూరం పెంచుకుంది. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరుకాలేదు. అంతేకాకుండా లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల పక్కన కూర్చోకూడదంటూ ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని స్పీకర్‌కు లేఖ రాసింది. మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ “సోదరుడు” అని సంబోధించారు. దేశ ప్రగతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ, “రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం విషయంలో మనం ఐక్యంగా ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం, గౌరవం, ఆశయాల కోసం కలిసి పనిచేస్తాం” అని పేర్కొన్నారు.
స్టాలిన్, విజయ్ శుభాకాంక్షల సందేశాలు తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలను ప్రతిబింబిస్తుండగా.. రాహుల్ గాంధీ స్పందనలు కూడా ప్రత్యేక రాజకీయ సందేశాలను ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు తమిళనాడులో టీవీకేతో పొత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు జాతీయ స్థాయిలో డీఎంకేతో సంబంధాలను కొనసాగించాలనే సంకేతాలను కాంగ్రెస్ ఇస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోక్‌సభలో 22 మంది ఎంపీలతో డీఎంకే ప్రతిపక్ష కూటమిలో కీలక శక్తిగా ఉండటంతో, భవిష్యత్తులో కాంగ్రెస్-డీఎంకే సంబంధాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.


- Tags
- congress
- DMK
- MK Stalin
- rahul gandhi
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!