Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 . డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం సుకుమార్, బన్నీ తమ మూడేళ్ల సమయాన్ని వెచ్చించారు. ప్రతి క్షణం సినిమాకోసం ఎంతగానో కష్టపడ్డారు.
Read Also:Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగాలి.. సభలో చర్చ కొనసాగాలి!
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది పుష్ప 2. విడుదలైన మొదటి రోజు పుష్ప – 2 ఏకంగా రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా హిందీ స్టార్ హీరోలకు మరో సారి రుచి చూపింది. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ అందుకుని ఇండియన్ సినిమా దగ్గర కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయగా అనుకున్నట్టుగానే ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ ని దాటుతుందనే ఆలోచనను నిజం చేసి చూపించింది.
Read Also:Pawan Kalyan: రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు: డిప్యూటీ సీఎం పవన్
అది కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని విధంగా ఫాస్టెస్ట్ రూ.1000 కోట్ల గ్రాస్ అందుకున్న చిత్రంగా కేవలం 6 రోజుల్లోనే రాబట్టి దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు వరకు బాహుబలి 2 ఫాస్టెస్ట్ రూ.1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా 10 రోజుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ దానిని నాలుగు రోజులు ముందే టచ్ చేసి అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశారనే చెప్పాలి. ప్రస్తుతానికి మేకర్స్ కూడా పుష్ప 2 వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసినట్టుగా కన్ఫర్మ్ చేసేశారు. ఇలా మొత్తానికి పుష్ప 2 ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక మర్చిపోలేని చరిత్రను రాసుకుందనే చెప్పాలి.
GodzillAA 😉🤙 #PUSHPA2HitsFastest1000Cr pic.twitter.com/inmcGwhUvE
— Pushpa (@PushpaMovie) December 11, 2024