GST: దేశీయ పరోక్ష పన్నుల విభాగంలో అతిపెద్ద సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) చట్టం అమల్లోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కేంద్ర, రాష్ట్రాల పరోఓ పన్నులు, సంకాలను విలీనం ద్వారా ఏర్పాటు చేసిన జీఎస్‌టీ చట్టం 2017 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలవారీ జీవెస్‌టీ వసూళ్లు రూ. 1.5 లక్షల కోట్ల స్థాయికి పెరిగాయి. 2017లో నెలవారీ వసూళ్లు రూ. 85,000 నుంచి రూ. 95,000 కోట్ల స్థాయిలో ఉండేవి. గడచిన ఆరేళ్లలో్ల 50 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డు సాయి రూ. 1.87 లక్షల కోట్లకు పెరిగాయి.
Read also: Prabhas: టీజర్ వార్ పీక్స్.. షారుఖ్ vs ప్రభాస్
వసూళ్లను మరింత పెంచేందుకు జీఎస్‌టీ అధికారులు ప్రస్తుతం పన్ను ఎగవేతల కట్టడిపై దృష్టి సారించారు. నకిలీ జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లను ఏరివేసేందుకు కేంద్ర, రాష్ట్రాల జీఎస్‌టీ అధికారులు కలిసి రెండు నెలల ప్రత్యేక డ్రైవ్ జరుపుతున్నారు. అందులో భాగంగా జీఎస్‌టీ నెట్‌వర్క్ 60వేల రిజిస్ర్టేషన్లను నకిలీవిగా అనుమానించింది. ఇప్పటి వరకు 43,000 రిజిస్ర్టేషన్ల ప్రాంతాల్లో అధికారులు భౌతిక సోదాలు జరపగా అందులో 11,140 నకిలీవని తేలింది. ఆ వ్యాపారులు రూ. 15,000 కోట్ల మేర బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) క్లెయిమ్ చేసుకున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీఎస్టీ ఎగవేత కేసుల సంఖ్య 14వేలకు పెరిగింది. 2021-22లో 12,574 కేసులు, 2020-21లో 12,596 కేసులు నమోదయ్యాయి. 2017 జులై 1 నుంచి 2023 ఫిబ్రవరి వరకు జీఎస్‌టీ అధికారులు 1,402 మంది పన్ను ఎగవేతదారులను అరెస్టు చేశారు.
Read also: ODI World Cup 2023: వెస్టిండీస్ ప్రపంచకప్ 2023 ఆశలు గల్లంతు.. కొంపముంచిన జింబాబ్వే!
అక్రమ పద్దతుల్లో ఐటీసీని క్లెయిమ్ చేసుకునే మోసగాళ్లను పసిగట్టేందుకు అధికారులు కృత్రిమ మేథ(ఏఐ) డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పన్ను ఎగవేతలు రూ. 3 లక్షల కోట్ల పైస్థాయిఓ ఉండవచ్చని. గత ఆర్థిక సంవత్సరం 2022-23లోనే మొత్తం రూ. లక్ష కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా నకిలీ ఇన్వాయిస్‌లు, మోసపూరిత ఐటీసీ క్లెయిమ్‌లను నిరోధించేలా జీఎస్టీ నెట్‌వర్క్ ను ఆధునికీరించాలి్సన అవసరం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్(జీటీఆర్‌ఐ) అంటోంది. డేటా అనాలసిస్, భౌతిక తనిఖీలు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించలేవు. కొనుగోలు దారు ఐటీసీ క్లెయిమ్ చేసుకునేందుకు జీఎస్‌టీఆర్3బీ నుంచి ఇన్వాయిస్ స్తాయి వివరాలను సరఫరాదారు జీఎస్‌టీఆర్2ఏ , జీఎస్‌టీఆర్2బీలో పొందపర్చిన సమాచారంతో అనుసంధానించడం ద్వారా మోసపూరిత ఐటీసీ క్లెయిమ్‌లకు చెక్ పెట్టవచ్చని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ఆరేళ్లు గడిచినా జీఎస్టీఎన్ ఈ సరఫరాదారులను అనుసంధానించలేకపోవడంతో భారీగా ఆదాయం నష్టపోవల్సి వస్తోందని నిజాయితీగా వ్యాపారం చేసేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.