Prabhas: టీజర్ వార్ పీక్స్.. షారుఖ్ vs ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇన్ని రోజులు ఆదిపురుష్ కారణంగా సలార్ అప్డేట్స్‌ను హోల్డ్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయింది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. జూలై 7న సలార్ టీజర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే రోజు.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలె పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. జవాన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 7న జవాన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో జవాన్ టీజర్‌ను జులై 7న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఒకే రోజు రెండు బిగ్ పాన్ ఇండియా సినిమాల టీజర్స్ బయటికి వస్తే.. టీజర్ వార్ పీక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్. నిజంగానే ఒకే రోజు ఈ ఇద్దరు స్టార్ హీరోల టీజర్లు రిలీజ్ అయితే.. ఆరోజు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం పక్కా. ఏ టీజర్ బాగుంది? ఏది ఎక్కువ వ్యూస్ రాబట్టింది? అనే కంపారీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ జవాన్ కంటే సలార్ పైనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి.. సలార్ టీజర్‌దే సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ అయ్యేలా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!