Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Wifes False Portrayal Of Husband As Womaniser Extreme Cruelty High Court

Delhi High Court: భర్తపై అలాంటి ఆరోపణలు చేయడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట..

Published Date :January 2, 2024 , 6:08 pm
By Venu Goapl Reddy
Delhi High Court: భర్తపై అలాంటి ఆరోపణలు చేయడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi High Court: భర్తపై నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అతడిని ‘స్త్రీలోలుడి’గా చిత్రీకరించడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట అని, ఇది వివాహ రద్దుకు కారణమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం భర్త దాఖలు చేసిన క్రూరత్వానికి సంబంధించిన విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలని, అవసరమైన సమయాల్లో రక్షణ కవచంలా ఉండాలని ఆశిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: EAM S Jaishankar: కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు చోటు.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తోంది..

ఏదైనా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా నిర్మించబడుతుందని, ఒక స్థాయికి మించి రాజీ పడితే ఆ బంధానికి ముగింపు అనివార్యమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ కేసులో భార్య, భర్త ఆఫీసు మీటింగ్స్‌లో, ఆఫీస్ సిబ్బంది ముందు ఆరోపణలు చేయడం, బహిరంగంగా వేధించడం, అవమానించడం, మాటలతో దాడి చేయడం వంటి సంఘటనలు ఉన్నాయని, చివరకు భార్య ఆఫీసులోని మహిళా ఉద్యోగులపై కూడా వేధింపులకు పాల్పడిందని, భర్తను ‘ఉమెనైజర్’గా చిత్రీకరించడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని, ఇలాంటి చర్యలు భర్త పట్ల భార్య క్రూరమైన చర్య అని హైకోర్టు చెప్పింది. విడాకులకు వ్యతిరేకంగా భార్య వేసిన పిటిషన్‌ని ధర్మాసనం తోసిపుచ్చింది.

భర్త స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధాన్ని అంటకట్టడం అనేది క్రూరత్వానికి పరాకాష్ట అని.. ఇది ఇతర జీవిత భాగస్వామి ప్రతిష్టను దిగజార్చడమే అని, అత్యంత క్రూరమైన చర్య తప్ప మరోటి కాదని కోర్టు పేర్కొంది. తన భర్త నపుంసకుడని భార్య పేర్కొంటూ.. అతను ఫిట్‌గా ఉన్నాడని గుర్తించేందుకు పొటెన్సీ టెస్ట్ చేయించుకోమని ఒత్తిడి చేయడం, అతనిపై మానసిక క్రూరత్వానికి గురిచేశాయని, భార్య తన బిడ్డను కూడా భర్త నుంచి దూరం చేసిందని, ఇది మానసిక క్రూరత్వమే అని కోర్టు పేర్కొంది. భార్యభర్తలు కలిసి ఉన్న 6 ఏళ్లు భర్త వేధింపులకు గురయ్యాడని రుజువు చేసిందని కోర్టు పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cruelty
  • Delhi High Court
  • Divorce
  • divorce case
  • extramarital relationship

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions