సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నుకు యాక్టింగ్ లైఫ్, కెరీర్ ఇచ్చిందే సౌత్ ఇండస్ట్రీ. ముఖ్యంగా టాలీవుడ్ ఆమెకు స్టార్డ్ డమ్ ఇచ్చింది. ఝమ్మందినాదంతో టీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ ప్రభాస్, ధనుష్, వెంకటేశ్, గోపీచంద్, రవితేజ, మోహన్ లాల్, అజిత్ లాంటి సౌత్ స్టార్లతో జోడీ కట్టింది. అంతలో బాలీవుడ్ రమ్మంటే అక్కడకు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి మేడమ్‌లో ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. నార్త్ బెల్ట్‌కు వెళ్లి టాలీవుడ్‌పై నోరు పారేసుకోవడంతో స్టార్స్‌తో నటించే ఛాన్స్ పొగొట్టుకున్నట్లయ్యింది.
Also Read : Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ‘విష్ణుప్రియ’ విచారణ పూర్తి.. మొబైల్ ఫోన్ సీజ్..
బాలీవుడ్ వెళ్లాక లేడీ ఓరియెంట్ చిత్రాలతో పాపులర్ అయ్యింది తాప్సీ. పింక్, నామ్ షబానా, తప్పడ్, హసీనా దిల్ రుబా, బద్లా లాంటి సినిమాలో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మధ్యలో తెలుగులో సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా ఆడలేదు. ఆనందో బ్రహ్మా తర్వాత చేసిన ఏ తెలుగు సినిమా హిట్ కాలేదు. 2022 తర్వాత మిషన్ ఇంపాజిబుల్ చేశాక టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు సొట్టబుగ్గలసుందరి. పూర్తి సేవలు బీటౌన్‌కే అందిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన దశాబ్దం దాటిన నార్త్ బెల్ట్‌లో త్రీ ఖాన్స్‌లో కేవలం షారూఖ్‌తో జోడీ కట్టింది తాప్సీ. సీనియర్ల కంటే జూనియర్లే బెటర్ అనుకుందేమో ఎక్కువగా యంగ్ హీరోలతో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ప్రతీక్ గాంధీ సరసన హో లడకీ హై కహాన్. ఇస్వాక్ సింగ్‌తో గాంధారీ చేస్తోంది బ్యూటీ. రీసెంట్లీ గాంధారీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. మరీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ.. ఇక టాలీవుడ్ కు టాటా చెప్పేసినట్లేనా..? నార్త్ బెల్ట్‌లో జెండా పాతేసినట్లేనా..? మేడమ్ ఏం చేస్తుందో చూద్దాం..