Ayodhya Ram Temple: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రామనామ స్మరణతో నిండిపోయింది. రేపు(జనవరి22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హిందువులు, రామ భక్తులు ఎదురుచూస్తు్న్నారు. శ్రీ రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశంలోని ప్రముఖులు ఈ ఈవెంట్‌కి రానుండటంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పలు ఉగ్రసంస్థల నుంచి బెదిరింపులు వస్తుండటంతో అన్ని విధాల భద్రత ఏర్పాట్లను పటిష్టం చేశారు.
Read Also: Matrimonial site: మాట్రిమోనీ సైట్‌లో పరిచయం.. మోసపోయిన మహిళ..
ఇదిలా ఉంటే బీహార్‌కి చెందిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం అనుచరుడినని జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని పేల్చేస్తాంటూ పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు. అరారియా జిల్లాకు చెందిన ఇంతేఖాబ్ ఆలమ్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అర్థరాత్రి పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా కలియగంజ్‌లోని అతని ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. జనవరి 19న నిందితుడు 112 నంబర్‌కి ఫోన్ చేసి, తన పేరును ఛోటా షకీల్ అని, దావూద్ ఇబ్రహీం అనుచరుడినని, రామ మందిరాన్ని పేల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతనికి క్రిమినల్ రికార్డ్ లేదని, మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు తెలుస్తోందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. సమస్య సున్నితమైంది కావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.