హర్యానాలో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో ఓటమిపై గుబులు మొదలైంది. సీనియర్ నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలోని ఓటమికి అనేక కారణాలలో ఒకటి.
హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు.
దేశంలో శనివారం మరో రసవత్తర పోరుకు హర్యానా రాష్ట్రం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశ ప్రజల చూపు హర్యానాపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
PM Modi: మరో రెండు రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆమె కజిన్ సిస్టర్ బబిత ఫోగట్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వినేష్.. కాంగ్రెస్‌లో చేరడాన్ని బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు.
Haryana Opinion Poll: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు ప్రస్తుతం బీజేపీ, ఇండియా కూటమికి చాలా కీలకంగా మారబోతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సొంత మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచి తమ పాలనకు తిరుగు లేదని నిరూపించుకోవాలని భావిస్తుండగా..
Amit Shah: ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్‌గా కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో మంగళవారం పర్యటించిన ఆయన, కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకున్నారు.