Sim binding: “సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు”.. మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్..
- ఇకపై సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు..
- మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్ రూల్స్..
- సైబర్ మోసాల అడ్డుకట్టకు కేంద్రం నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sim binding: సిమ్ లేకుండా, అదే నెంబర్‌తో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. మార్చి 1, 2026 నుంచి ‘‘సిమ్ బైండింగ్’’ అనే కొత్త నిబంధన రాబోతోంది. దీని వల్ల మొబైల్‌లో సిమ్ ఉండీ, దాని నెంబర్‌లో లింక్ అయితేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఏ నంబర్‌లో వాట్సాప్ వాడుతున్నారు, ఆ సిమ్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి. ఒక వేళ ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే పనిచేయదు. సైబర్ మోసాలు, నకిలీ అకౌంట్లను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: T20 World Cup 2026: గొప్ప సహాయం చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా సెమీఫైనల్స్ ఛాన్సెస్ మరింతగా మెరుగు!
Also Read
రిపోర్ట్స్ ప్రకారం.. ఈ నియమానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, పాటించని యాప్ కఠినమైన చర్యల్ని ఎదుర్కొంటుందని స్పష్టం చేసింది. ఇది వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన పెంచింది. ఇక వాట్సాప్ వెబ్ వాడే వారు ప్రతీ 6 గంటలకు ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. 6 గంటల్లో మళ్లీ లాగిన్ కాకుంటే మీ వెబ్ సెషన్ క్యాన్సల్ అవుతుంది. ఈ నిబంధనలు కేవలం వాట్సాప్‌కు మాత్రమే కాకుండా, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి అన్ని ఓటీటీ మెసేజింగ్ యాప్స్‌కు వర్తిస్తుంది. మార్చి 1లోగా ఈ మార్పులు చేయని యాప్స్‌పై స్పష్టమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
మొబైల్ నంబర్లు మరియు యాప్‌ల మధ్య నకిలీ కనెక్షన్లు, నకిలీ ప్రొఫైల్‌లు, ఫోన్ స్కామ్‌లతో కూడిన మోసాలను ఎదుర్కోవడానికి ఈ నియమం అవసరమని పేర్కొంటున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌లు 90 రోజుల్లోపు ఈ నియమాన్ని అమలు చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని వల్ల డిజిటల్ నేరాలను గుర్తించడం సులభం అవుతుంది. జాతీయ భద్రతకు సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. వాట్సాప్ ఇప్పటికే సిమ్ బైండింగ్‌పై పనిచేస్తోంది. ఈ నియమం వల్ల వినియోగదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ ఫోన్ నుంచి సిమ్ తీసిన వెంటనే వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్స్ ఆగిపోతాయి. ఈ నియమం వల్ల విదేశాల్లో ఆ దేశ సిమ్ కొనుగోలు చేసి వాడే వారిపై ప్రభావం ఉంటుంది.
తాజావార్తలు
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!