Fraud: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..? బాధితుడు అత్తాపూర్కు చెందిన వ్యక్తి. అయితే.. తనకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా…
సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సరికొత్త ఎత్తుగడలతో బురిడి కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులే కాదు.. అక్షరాస్యులు కూడా సైబర్ మోసాల భారిన పడుతున్నారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్ సైబర్ వలలో పడ్డారు. ఏకంగా రూ.1.62 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్కే షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్నే మోసం చేసిన కేటుగాళ్లు. తిరుమల దర్శనం, వసతి…
నల్లగొండ జిల్లాలో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ ను సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురిచేశారు. బెంగుళూరులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినావని అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేశారు సైబర్ నిందితులు. అరెస్ట్ కావద్దు అంటే రూ.18 లక్షలు తమ ఎకౌంట్ లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధిత రిటైర్డ్ టీచర్ రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల ఎకౌంట్ లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. డబ్బు బదిలీ చేసేందుకు…
Rakul Preet : ఈ మధ్య సెలబ్రిటీల పేర్లతో మోసాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు, హీరోల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గానే అదితిరావు హైదరీ పేరుతో ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేయగా.. ఆమె వెంటనే అలెర్ట్ అయి బయట పెట్టేసింది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్…
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాట్సాప్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు జారీ చేసింది. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం…
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు. తాజాగా పూణేలో ఓ రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి ఏఖంగా రూ. 1.19 కోట్లు కాజేశారు. తన జీవిత కాలంలో దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ వేధింపులు, ఆర్థిక నష్టం ఒత్తిడి కారణంగా బాధితుడు అక్టోబర్ 22న ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించినట్లు…
దీపావళి ఆఫర్లు అనగానే.. వావ్ అని నోరెళ్లబెడుతున్నారా !! దివాళి గిఫ్ట్స్, బోనస్, రివార్డ్ పాయింట్స్ అనగానే… వెనకాముందు ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త !! ఇప్పటికే దివాళి దొంగలు ఎంట్రీ ఇచ్చేశారు. దీపావళిని కూడా కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఇప్పటికే రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం చేశారు. సందర్భమేదైనా సరే… సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టినా.. కంపెనీలు ఆఫర్లు ప్రకటించినా.. పండగలు…
హైదరాబాద్లో ఓ 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల మోసానికి గురయ్యాడు. నేరస్తులు తనను భయపెట్టడానికి పహల్గాం టెర్రర్ ఘటనను పునర్వినియోగం చేసుకున్నారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు.
సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో.. వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని.. కొడుకు పోలీసులను ఆశ్రయించాడు.