ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. తాజాగా వాట్సాప్ సేవలకు సంబంధించిన కొన్ని రూల్స్ మారాయి. సైబర్ మోసాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పుడు, మీ ఫోన్ నుంచి యాక్టివ్ సిమ్ కార్డ్‌ను తీసివేసిన తర్వాత అన్ని మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమాలను అమలు చేసింది. వాట్సాప్ ఇకపై సిమ్ లేకుండా పనిచేయదు. Also Read:Samantha Marriage…
కమ్యూనికేషన్ యాప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే యాప్‌లు పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది.…