* విశాఖ: నేడే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మ్యాచ్ నిర్వహణ పై ఉత్కంఠ.. ఏసీఏ వీడిసిఎ స్టేడియంలోని పిచ్ పూర్తిగా కప్పివేత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్
* ఏపీ: నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ.. రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి.. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి రూ. 698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
* అమరావతి: ఆదివారం కూడా సమావేశం కానున్న అసెంబ్లీ.. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు
* నేడు ఖమ్మం లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం.. పాల్గొననున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
* భద్రాద్రి: నేడు భద్రాచలంలో పుష్కర నది జలాల తీర్థ యాత్ర.. దేశంలోని వివిధ నదుల నుంచి తెచ్చిన నదుల తీర్థాలను ఊరేగింపుగా రామాలయంకు తీసుకునిరానున్న అర్చకులు
* ప్రకాశం : ఒంగోలు సుందరయ్య భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం..
* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం.. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన టిటిడి
* నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం.. ఉదయం గం.10.15 కు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.20 కు తిరువూరులోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకోనున్న సిఎం.. ఉదయం 11 గంటల నుండి 12.30 వరకు జగనన్న విద్యా దీవెన నగదు బదిలీకు సంబంధించిన బటన్ నొక్కటం, తదుపరి విద్యార్థులు, ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు.
* ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరులోని కనపర్తిపాడులో ఉగాది వేడుకలు
* నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
* నేటి నుండి శ్రీశైలం క్షేత్రంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు.. నేడు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు శ్రీకారం.. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న భ్రమరాంబికాదేవి.. సాయంకాలం బృంగివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. శ్రీస్వామి అమ్మవారు గ్రామోత్సవం
* తూర్పుగోదావరి జిల్లా : ఈనెల 20, 21 తేదీల్లో జిల్లాలో 66 ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ నవీకరణ.. కొవ్వూరు డివిజన్ లో 20 కేంద్రాలు, రాజమండ్రి డివిజన్ లో 46 కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ కి అవకాశం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రతి 10 సంవత్సరాలు తప్పనిసరిగా ఆధార్ నవీకరణ తప్పనిసరి
* నంద్యాల: నేడు పాణ్యం (మం) కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో నాగ దోష పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు
* కర్నూలు: హాళగుంద మండలం దేవరగుట్టులో మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో కుంకుమార్చన, మహా మంగళారతి, ప్రత్యేక పూజలు , అన్నదానం
* నంద్యాల: నేడు పద్మావతి నగర్ కృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్ట
* ఏలూరు జిల్లా: అకాల వర్షాలు నేపథ్యంలో మొక్కజొన్న కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సూచన.. జిల్లాలో 71,300ఏకరల్లో మొక్కజొన్న సాగు..
* రేపు ఏలూరు కలెక్టరేట్లో యధావిధిగా స్పందన కార్యక్రమం..
* నేడు రాజమండ్రిలో చట్టసభల్లో గోదావరి గళం అనే పుస్తక ఆవిష్కరణ మహోత్సవం .. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రచించిన ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొననున్న మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు
* కామారెడ్డి : నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష.. గాంధారి శివాజీ చౌక్ వద్ద నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్న రేవంత్.. ఉదయం 9 గంటలకు జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా వెళ్లనున్న రేవంత్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్