* హైదరాబాద్: నేడు ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫార్ములా ఈ రేస్
* నేడు నేషనల్ పోలీస్ అకాడమీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్‌షా
* శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ
* తిరుమల: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లతో పాటు మార్చి మాసానికి సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* విశాఖ: నేడు జిల్లా కోర్టుల ప్రాంగణంలో “నేషనల్ లోక్ అదాలత్”.. న్యాయసేవా సదన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహణ.
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటన.. ఎస్.ఆర్.కె, విష్టు కళాశాలల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్న వెంకయ్యనాయుడు..
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* కర్నూలు: కోసిగిలో నేడు ఎల్లమ్మ జాతర మహా రథోత్సవం.. అమ్మవారిని గ్రామ వీధుల్లో ఉరేగింపు.. అమ్మవారికి తెల్లవారుజామున కుంకుమ అర్చన, తులసి అర్చన, కనకాభిషేకం వంటి విషేశ పూజలు..
* కడప: నేడు రామాంజనేయ పురంలో కడప వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, ఇతర వైసిపి నేతలు.
* కడప: నేడు జాతీయ లోక్ అదాలత్.. జిల్లా వ్యాప్తంగా 25 బెంచీల ఏర్పాటు.
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయస్థానాలలో మెగా లోక్ అదాలత్..
* బాపట్ల: అమృతలూరు మండలం ఇంటూరు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* పల్నాడు: చిలకలూరిపేట 28వ వార్డులో నేడు రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్ననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని…
* గుంటూరు: తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు (అరసం) అభ్యుదయ రచయితల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు..
* గుంటూరు: నేడు చంద్రమౌళి నగర్ లో అమరావతి ఉద్యమ , సమన్వయ కమిటీ సమావేశం…
* గుంటూరు : నేటి నుండి రెండు రోజుల పాటు గుంటూరు లో బాలోత్సవం.. నేడు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో బాలోత్సవం ప్రారంభం.
* గుంటూరు: నేడు అరండల్ పేట లో బీసీ మేధావుల సదస్సు , హాజరుకానున్న వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ ప్రముఖులు , ..బీసీల జనగణన ,ఇతర సమస్యలపై చర్చ….
* ప్రకాశం : పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యక్రమాలు.. యర్రగొండపాలెంలో నూతనంగా నియమించిన గ్రామసచివాలయ కన్వీనర్లు, గృహసారదుల సమావేశంలో పాల్గొననున్న మంత్రి సురేష్.. అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు జాతీయ లోక్ అదాలత్ రాజమండ్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ .. జాతీయ లోక్ అదాలత్ లో కోర్టులలో పెండింగ్ ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీ పడ్డదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరం
* నెల్లూరు జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం.. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నెల్లూరుతో పాటు 9 కేంద్రాల్లో జాతీయ లోక్ అదాలత్
* హైదరాబాద్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్.. ఇవాళ నామినేషన్ వేయనున్న బండా ప్రకాష్