BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- ప్రపంచ రక్షణ మార్కెట్లో బ్రహ్మోస్ హవా
- భారత్ ఎగుమతులకు కొత్త ఊపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Defence Export Boost: భారత రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ క్షిపణి, దేశ రక్షణ ఎగుమతుల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి ఒప్పందాలు కుదిరాయి. ఈ మూడు దేశాలతో కలిపి 60 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) విలువైన ఒప్పందాలు జరిగినట్లు డిఫెన్స్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
మూడు దేశాలతో బ్రహ్మోస్ ఒప్పందాలు
బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి సంబంధించి ఇప్పటివరకు మూడు దేశాలతో ఒప్పందాలు కుదిరినట్లు డిఫెన్స్ సెక్రటరీ తెలిపారు.
Also Read
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
- Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
- Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
ఫిలిప్పీన్స్: సుమారు 33 కోట్ల డాలర్లు
వియత్నాం: సుమారు 10 కోట్ల డాలర్లు
ఇండోనేషియా: సుమారు 20 కోట్ల డాలర్లు
ఫిలిప్పీన్స్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా ప్రారంభమైంది.
సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం
బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన విమాన ప్రయోగ వెర్షన్ కూడా సిద్ధమైంది. దీనిని సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించే పరీక్ష విజయవంతంగా పూర్తయిందని డిఫెన్స్ సెక్రటరీ తెలిపారు. శబ్ద వేగం కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించే ఈ గైడెడ్ క్షిపణి, లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
బ్రహ్మోస్ క్షిపణి తన దాడి సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ సమయంలో నిరూపించుకుందని రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయడం ద్వారా సైనిక చర్యల్లో భారత్‌కు ప్రయోజనం కల్పించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా బ్రహ్మోస్ భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
80 దేశాలకు భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు
భారత రక్షణ ఎగుమతులు ప్రస్తుతం ప్రపంచంలోని 80 దేశాలకు చేరుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరినట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే ఇది 62 శాతానికి పైగా వృద్ధిగా నమోదైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా గతంలో బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని, రక్షణ రంగంలో భారత్ పెరుగుతున్న సామర్థ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
రూ.80 వేల కోట్లతో ఆరు పన్నీటి జలాంతర్గాములు
మరోవైపు చైనా-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న నౌకాదళ సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ కూడా సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.80 వేల కోట్ల వ్యయంతో ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు జర్మనీతో ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరినట్లు డిఫెన్స్ సెక్రటరీ తెలిపారు. ఈ జలాంతర్గాములను భారత్‌లోనే నిర్మించనున్నారు.
అదేవిధంగా మరో మూడు స్కార్పీన్ తరగతి యుద్ధ జలాంతర్గాములను నిర్మించే అంశంపైనా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. వీటి నిర్మాణం ముంబైలోని మజ్గావ్ డాక్‌యార్డ్‌లో చేపట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, బ్రహ్మోస్ వంటి అధునాతన ఆయుధాల ఎగుమతులతో పాటు దేశీయంగా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణాన్ని పెంచడం ద్వారా భారత్ తన డిఫెన్స్ ప్రెటెక్షన్ కెపాసిటీ విస్తరిస్తోంది.
తాజావార్తలు
-
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!