Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ జంటగా వచ్చిన సినిమా ‘తీన్మార్’. బాలీవుడ్లో విజయవంతమైన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. భారీ అంచనాలు, పవన్ క్రేజ్‌తో 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కథ, నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీన్మార్ ఫలితం ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని జయంత్ సి. పరాన్జీ చెప్పుకొచ్చారు. ‘షూటింగ్ చేస్తున్నప్పుడే తీన్మార్ సినిమా ఆడదని నాకు తెలుసు. ఎందుకంటే సినిమా ప్రాసెస్‌లో రైటర్ త్రివిక్రమ్‌ను నేను కనీసం ఒక్కసారి కూడా కలవలేదు. ఆయన ఖలేజా సినిమాతో బిజీగా ఉన్నారు. నన్ను మాత్రం చివర్లో దర్శకుడిగా తీసుకున్నారు. అలాగే లవ్ ఆజ్ కల్ కథ బాలీవుడ్ సెన్సిబిలిటీస్, అక్కడి సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. అదే కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదు’ అని అన్నారు.
Also Read
‘ఒరిజినల్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న స్టార్ ఇమేజ్‌లోనూ తేడా ఉంది. తీన్మార్ సినిమా అక్కడి ప్రేక్షకుల సెన్సిబిలిటీస్‌కు సరిపోయింది, అందుకే అక్కడ హిట్ అయింది. పవన్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో అలాంటి సబ్జెక్ట్ తీయడం మన ఆడియన్స్‌కు పెద్దగా రుచించలేదు. బెనిఫిట్ షోలు పూర్తయిన తర్వాత కొంతమంది అభిమానులు నా ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సినిమాలోని క్లైమాక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనూ సూద్‌తో పెళ్లయిన హీరోయిన్ మా హీరో దగ్గరకు ఎలా వస్తుంది? అసలు ఆ క్లైమాక్స్ ఏంటి?’ అంటూ అభిమానులు గొడవ చేశారని జయంత్ సి. పరాన్జీ గుర్తుచేసుకున్నారు.
పవన్ కల్యాణ్, త్రిష వంటి క్రేజీ కాంబినేషన్, త్రివిక్రమ్ మాటలు, ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్ అనే అంశాలతో ‘తీన్మార్’పై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ‘తీన్మార్’ను వార్తల్లోకి తీసుకొచ్చాయి. అయితే మైఖేల్ వేలాయుధం, అర్జున్ పాల్వాయిగా పవన్ చూపించిన వేరియేషన్స్.. త్రిష గ్లామర్, మణిశర్మ సాంగ్స్ సినిమాకు ప్రత్యేకంగా నిలిచాయి. డైలాగ్స్ సరిగ్గా వినిపించకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్ అని అప్పట్లో ఫాన్స్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?