Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- గాంధీ-శాస్త్రి జయంతి
- రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో ప్రముఖుల ఘన నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanti 2026: దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ సర్వమత ప్రార్థనా సభ నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ప్రార్థనలు నిర్వహిస్తూ గాంధీజీ సత్యం, అహింస సందేశాన్ని స్మరించుకున్నారు.
రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి ముర్ము నివాళి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా బాపూజీకి నివాళి అర్పించారు. గాంధీజీ శాంతి, అహింస సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో గాంధీజీ శాంతి, అహింస సందేశం మరింత ప్రాసంగికంగా మారిందని రాష్ట్రపతి తెలిపారు.
Also Read
ఖర్గే, రాహుల్ గాంధీ, ఓం బిర్లా నివాళి
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు.
గాంధీజీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్న నేతలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ.. ప్రపంచానికి శాంతి, అహింస మార్గాన్ని చూపిన గాంధీజీ జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. స్వదేశీ, స్వరాజ్యంపై ఆయన ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గాంధీజీ సత్యం, అహింస సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆలోచనలు దేశ నిర్మాణంలో ఇప్పటికీ ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.
విజయ్‌ఘాట్‌లో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి
గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా దేశం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్‌ఘాట్‌లో శాస్త్రి సమాధి వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శాస్త్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
‘జై జవాన్.. జై కిసాన్’ నినాదాన్ని గుర్తు చేసుకున్న రాజ్‌నాథ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. శాస్త్రి జీవితం సరళత, నిజాయితీ, దృఢ సంకల్పానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం దేశ భద్రత, వ్యవసాయం, జాతీయ నిర్మాణం పట్ల ప్రజల సంకల్పానికి ఇప్పటికీ స్ఫూర్తినిస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మనోహర్ లాల్ తదితరులు కూడా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.
గాంధీ, శాస్త్రి ఆశయాల స్మరణ
అక్టోబర్ 2న ఒకే రోజు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు జరుపుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది. గాంధీజీ సత్యం, అహింస, స్వదేశీ, స్వరాజ్య సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లగా.. శాస్త్రి సరళత, నిజాయితీ, దేశసేవ, ‘జై జవాన్- జై కిసాన్’ నినాదంతో ప్రజలపై ప్రభావం చూపారు. ఈ ఇద్దరు నేతల ఆశయాలను రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the occasion of his 157th birth anniversary. pic.twitter.com/l3EvaB5Meq
— ANI (@ANI) October 2, 2026
తాజావార్తలు
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!