Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్
- రెండో సెమీఫైనల్లో భారత్ విజయం..
- శ్రీలంకపై 124 పరుగుల తేడాతో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది.
భారత్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 7, సంజూ శాంసన్ 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 8, తిలక్ వర్మ 2, శివమ్ దూబే 3 పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 169/7 స్కోరు సాధించి.. శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
లక్ష్య ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే తడబడింది. జస్ప్రీత్ బుమ్రా వరుసగా కీలక వికెట్లు తీసి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. శ్రీలంక ఓపెనర్ సినెత్ జయవర్ధన రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత సోహన్ డి లివెరాను కూడా బుమ్రానే పెవిలియన్‌కు పంపాడు. నువానిడు ఫెర్నాండో 11 బంతుల్లో 15 పరుగులు చేసి శ్రీలంక తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. సాహన్ అరచిగే 9 పరుగులు, చామిక కరుణరత్నే 4 పరుగులు, థరిందు రత్నాయకే 5 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
భారత్ తరఫున అక్షర్ పటేల్ 3 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 2 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్, అభిషేక్ శర్మ కేవలం 5 బంతుల్లో 2 వికెట్లు సాధించాడు. దీంతో శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. దీనితో భారత్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ లోఫైనల్ కు చేరుకుంది. బంగారు పతకం కోసం భారత్ పాకిస్థాన్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!