Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Vivo T5 సిరీస్‌లో కొత్త వేరియంట్లు
- RAM, స్టోరేజ్ వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T5 Lite 5G, T5 Pro 5G New Variants: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్‌లో T5 సిరీస్‌లోని Vivo T5 Lite 5G, Vivo T5 Pro 5G మోడళ్లకు కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లను విడుదల చేసింది. కొత్త వేరియంట్లలో తక్కువ RAM, స్టోరేజ్‌తో కూడిన ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు లభించనున్నాయి.
Vivo T5 Lite 5G కొత్త వేరియంట్ ధర
Vivo T5 Lite 5G కొత్తగా 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర రూ.30,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతంలో 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లలో విడుదల చేశారు. కొత్త 4GB + 64GB వేరియంట్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkart ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న Big Billion Days సేల్‌లో కొత్త వేరియంట్లు విక్రయానికి రానున్నాయి.
Also Read
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
Vivo T5 Pro 5G కొత్త వేరియంట్
Vivo T5 Pro 5G కూడా కొత్తగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో లభించనుంది. దీని ధర రూ.49,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను గతంలో 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను జోడించారు.
Vivo T5 Lite 5G స్పెసిఫికేషన్స్
Vivo T5 Lite 5Gలో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. పనితీరు కోసం ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6.0పై పనిచేస్తుంది.
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 0.8MP సెకండరీ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా అందించారు. Vivo T5 Lite 5Gలో 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
Vivo T5 Pro 5G స్పెసిఫికేషన్స్
Vivo T5 Pro 5Gలో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, గేమింగ్ వంటి పనుల్లో స్మూత్ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. Vivo T5 Pro 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP కెమెరా అందించారు. ఈ ఫోన్లోని ముందు, వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి. Vivo T5 Pro 5Gలో 9,020mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ ఈ ఫోన్లోని ప్రధాన ఫీచర్లలో ఒకటిగా నిలుస్తాయి.
అక్టోబర్ 8 నుంచి విక్రయాలు
Vivo T5 Lite 5G, Vivo T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Billion Days సేల్ సందర్భంగా అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?