Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. బ్రిక్స్ సమ్మి్‌ట్‌లో భాగంగా నేడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బ్రిక్స్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోడీ.
* నేడు వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి తదితర నేతలు..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
* అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశం
* నేడు తెలంగాణలో మూడో రోజు గ్రూప్-1 పరీక్షలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు
* దన తూఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. నేడు సికింద్రాబాద్ – భువనేశ్వర్, హైదారాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – మల్దాటౌన్.. రేపు హౌరా – సికింద్రాబాద్, షాలిమార్ – హైదారాబాద్, సిల్చార్ – సికింద్రాబాద్ రైళ్లు రద్దు..
* హైదరాబాద్: నేటి నుండి ఉద్యమం ఉధృతం చేయాలని ఏఈవోల పిలుపు..
* నేడు సియోల్‌లో మూడో రోజు తెలంగాణ అధికార బృందం పర్యటన.. AI సిటీని సందర్శించనున్న బృందం.. ప్యూచర్ సిటీ లో ఏర్పాటు చేయనున్న AI సిటీ పై సెమినార్ లో పాల్గొననున్న బృందం.. అనంతరం స్మార్ట్ సిటీ పై కాన్పరెన్స్ లో పాల్గొననున్న ప్రతినిధి బృందం.. సాయంత్రం ఇండియన్ అంబాసిడర్ తో సమావేశం కానున్న బృందం
* కడప జిల్లాలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.. బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురిఅయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్.. తదనతరం పులివెందలకు వైఎస్ జగన్
* కడప : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
* అనంతపురం : నేడు స్టాఫ్ నర్సు అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు. అనంతపురం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హల్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న 246 మంది స్టాఫ్ నర్సులు
* నేడు గుంటూరులో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 10:30 గంటలకు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకోనున్న జగన్ .. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో మృతి చెందిన , తెనాలి యువతి సహనా కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్.. అనంతరం హెలికాప్టర్‌లో వైఎస్ఆర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్న వైఎస్ జగన్..
* అనంతపురం : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నేడు ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు.
* గుంటూరు: నేడు నాగార్జున యూనివర్సిటీలో ఏపీ ఎస్పీ ఎఫ్ రైసింగ్ డే వేడుకలు… పాల్గొననున్న హోం మంత్రి వంగలపూడి అనిత, యూనివర్సిటీలో పోలీసు క్రీడా పోటీలను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత….
* అమరావతి: ఇవాళ రెండవ రోజు డ్రోన్ సమ్మిట్.. వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు.. 4 కీలక ప్రజెంటేషన్లు, అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్
* శ్రీ సత్యసాయి : కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో చిలమత్తూరు మండలంలో ప్రవహిస్తున్న కుషా వతి, చిత్రావతి నదులు
* తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు.. మధ్యహ్నం 3 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల..
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,359 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,711 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు
* చిత్తూరు: నేడు సిఐడి సోదాలు కోనసాగే అవకాశం.. నిన్న చిత్తూరులోని రెండు డిస్టరీల్లో, రేణిగుంటలోని ఓ డిస్టలరీలో సిఐడి సోదాలు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!