Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- 2029లో రాహుల్ గాంధీ ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలన్న అమిత్ షా
- ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టిన కేంద్ర హోంమంత్రి
- బ్యాలెట్ పేపర్‌తో జరిగిన గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేదని వ్యాఖ్య
- SIRపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 2029లో రాహుల్ గాంధీ ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈవీఎంలే తమ ఓటమికి కారణమని చెబుతున్నాయని, గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో జరిగిన కాంగ్రెస్ గెలవలేదని అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే అని తేలిందని అమిత్ షా అన్నారు. త్రిపుర, బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దశాబ్ధాలుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని అమిత్ షా గుర్తు చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తప్పుబడుతూ.. ‘SIR’ అనేది 2024 తర్వాతే అమలులోకి వచ్చిందని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినప్పటి నుంచే ఆ పార్టీ వరస ఎన్నికల్లో ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, ఇది రాహుల్ గాంధీకి ఒక పాఠం లాంటిదని అన్నారు. రాజస్థాన్‌లో 85 శాతం వార్డుల్లో ఆప్ తన డిపాజిట్ కోల్పోయిందని అన్నారు. త్రిపుర గ్రామ కమిటీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ఎన్నికల్లో బీజేపీ గెలుపు, మోడీ ప్రజాదరణను రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ అక్రమాలుగా పొరబడుతున్నారని, ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇటీవల పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదని అన్నారు. కాంగ్రెస్ స్థానమైన అస్సాంలోని నౌగావ్‌లో బీజేపీ గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. గుజరాత్లో చివరిసారిగా కాంగ్రెస్ 41 ఏళ్ల క్రితం గెలిచిందని, ఇది రాహుల్ గాంధీ తెలుసుకోవాలని అన్నారు.
#WATCH | Delhi | On Gujarat Local Body Election Results 2026, Union Home Minister Amit Shah says, "Elections were held today for three municipalities and municipal corporations in Gujarat. The Bharatiya Janata Party achieved a resounding victory, winning 90 out of the total 104 seats across these two municipalities and one municipal corporation. In the Gandhinagar Municipal Corporation—which falls within my constituency—the BJP won 38 out of 44 seats. The Aam Aadmi Party contested all 32 seats but forfeited its security deposit on every single one of them. This massive victory in Gujarat reflects the mood of the state’s voters, demonstrating that the electorate of Gujarat stands rock-solid behind Narendra Modi ji. Compared to the previous election, the BJP has increased its vote share by 10% in the Gandhinagar Municipal Corporation. I want to make this point clear—and specifically convey it to Rahul ji—that the Congress party has not won a single election in 41 years. The last election they won was back in 1985; since then, they have faced continuous defeats in Gujarat"
— ANI (@ANI) October 13, 2026
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!