India Pakistan War: భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. వార్ బ్లాక్ అవుట్ వెలుగులోకి వచ్చింది.. బ్లాక్ అవుట్ అంటే ఏంటి..? అసలు ఎందుకు ఇది అమలు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. అసలు Wartime Blackout అంటే ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. శత్రువుల నిఘా నుంచి.. వాళ్ల దాడుల నుంచి.. ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా ప్రకటించేదే వార్‌టైమ్ బ్లాక్అవుట్..
Read Also: Operation Sindoor Effect: భారత్ దెబ్బకు అడుక్కుతినే పరిస్థితిలో పాకిస్తాన్..?!
బ్లాక్ అవుట్ ఎందుకు ప్రకటిస్తారు..?
శత్రువుల నిఘా నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ప్రకటించే ఈ బ్లాక్ అవుట్‌తో యుద్ధ సమయంలో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులకు మన ప్రాంతాలు కనిపించకుండా ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం.. ఆయా ప్రాంతాలను పూర్తి చీకట్లోకి నెట్టేయడాన్నే బ్లాక్ అవుట్ అంటారు.. ఈ సమయంలో మొత్తం పవర్ కట్ చేస్తారు.. అంతేకాదు.. వాహనాలను కూడా లైట్లు వేసుకొని తిరిగేందుకు అనుమతి ఇవ్వరు.. దీదని ద్వారా శత్రువులు మన ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది..
Read Also: Flights Fly Over Tirumala Temple: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..!
బ్లాక్అవుట్ను ఎలా అమలు చేస్తారనే విషయాల్లోకి వస్తే.. ఈ సమయంలో ప్రభుత్వం, ఆర్మీ సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. నివాస ప్రాంతాల నుంచి బయటకు వెలుతురు రాకుండా కర్టన్ల లాంటివి వాడాల్సి ఉంటుంది.. ఇక, ఈ సమయంలో వీధిలైట్లను పూర్తిగా ఆపేస్తారు.. లేదంటా 25 శాతానికి తగ్గిస్తారు.. అంటే మిగతా 75 శాతం వీధిలైట్లను పూర్తిగా బంద్ చేయిస్తారు.. వాహనదారులు కూడా తక్కువ వెలుతురుతో కూడిన లైట్లనే తమ వాహనాలకు వాడాల్సి ఉంటుంది.. షాపులు నిర్వహించేవారు.. వీధుల్లోకి వెలుతురు రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. అంటే, ఈ సమయంలో శత్రువులకు వెలురు కనిపించకుండా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం..
Read Also: VC Sajjanar : సరిహద్దుల్లో ఉద్రిక్తత.. కొత్త దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు
బ్లాక్ అవుట్లో భాగంగా ఇలా లైట్లు అన్నీ ఆపేడయం.. లేదా తగ్గించడం ద్వారా.. అవి గ్రామాలు, పట్టణాలు, సిటీలు, పారిశ్రామిక వాడలు, కీలక నిర్మాణాలను గుర్తించడం కష్టంగా మారడంతో.. వాటిపై గగన తల దాడులు జరిగే అవకాశాలు తగ్గిపోతాయి.. అయితే, ఈ సమయంలో ప్రజల నుంచి భారత ఆర్మీకి, ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.. ప్రభుత్వ సూచనలు పాటించి.. బ్లాక్అవుట్ను అంతా అమలు చేసినప్పుడే.. శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. దేశాన్ని కూడా కాపాడినవారము అవుతాం..
Read Also: Flights Fly Over Tirumala Temple: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..!
కాగా, భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.. దీంతో పాకిస్తాన్ సరిహద్దులో అన్ని ప్రాంతాలు పవర్ బ్లాక్అవుట్ చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను వెంటనే చేపట్టింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు బ్లాక్అవుట్ ప్రాంతాలకు విద్యుత్ అందించబడదు. దీనిమూలం శత్రువుల తాకిడిని ఎదుర్కోవాలి, ప్రతిస్పందనను తొక్కడం సైనికులకు సహాయం చేస్తుంది. పాకిస్తాన్ భారతదేశం మీద దాడి నిర్వహిస్తోన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలైన జమ్ము కాశ్మీర్ మొదటి పంచాప్ వరకు విద్యుత్ పూర్తిగా బంద్ చేయనున్నారు.. పహల్గామ్ తీవ్రవాద దాడికి వ్యతిరేకంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ చర్య తీసుకోవడంతో.. పాకిస్తాన్ ప్రతిస్పందనను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్, పఠాన్‌కోడ్, ఉదంపూర్తో సహా సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్లో దాడిని నిర్వహిస్తోంది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న విషయం విదితమే..