Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు.
Read Also: Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
అయితే ఈ వ్యాఖ్యలపై కెనడా స్పందించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ శుక్రవారం మాట్లాడుతూ.. మేం ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నాం, ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులపై కెనడా విచారణ జరుపుతున్నట్లు రోడ్రిగ్జ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కెనడాలో దాదాపు 7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. వీరు కెనడాలో జనాభాలో 2 శాతం ఉన్నారు.
జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో, భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం నడుస్తోంది. కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. అయితే కెనడా చర్యలకు ప్రతిచర్యగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. భారత్ లోని కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో పాటు కెనడాలో, ఇండియాలో దౌత్యవేత్తలు సమానంగా ఉండేలా 41 మంది కెనడా దౌత్యవేత్తలు దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!