Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన కానుకల చోరీ ఉదంతం ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ భారీ అక్రమాలపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై గురిపెట్టారు. ఇందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా మొత్తం 6 నుంచి 7 ప్రముఖ బ్యాంకులకు పోలీసులు అఫీషియల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ట్రస్ట్‌కు సంబంధించిన ప్రధాన బ్యాంక్ ఖాతాలు, లాకర్ల వివరాలతో పాటు ఇటీవల జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల రికార్డులను తక్షణమే సమర్పించాలని పోలీసులు ఆయా బ్యాంకులను ఆదేశించారు. భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము ఏ ఏ అకౌంట్లలోకి బదిలీ అయింది? ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో ‘ట్రాన్సాక్షన్ ట్రైల్’ ద్వారా నిధుల కదలికలను దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఎస్బీఐ మేనేజర్ల విచారణ..
రామమందిర ట్రస్ట్‌కు చెందిన ప్రధాన బ్యాంక్ ఖాతా నడుస్తున్న అయోధ్యలోని ఎస్బీఐ ‘నయా ఘాట్’ బ్రాంచ్‌కు పోలీస్ ప్రత్యేక బృందం వెళ్లింది. క్యాష్ కౌంటింగ్, హ్యాండ్లింగ్, బ్యాంక్‌కు నిధుల బదిలీ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే బ్యాంక్ మేనేజర్‌ను కూడా విచారించి, ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం బ్యాంక్ లావాదేవీల రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, క్యాష్ మూవ్మెంట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
ఎస్బీఐ ఉద్యోగుల అరెస్ట్..
ఈ విరాళాల లెక్కింపు, భద్రత, బ్యాంక్‌కు తరలింపు ప్రక్రియలో కొందరు బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్బీఐ పేరోల్‌పై పనిచేస్తున్న రత్నేష్, గగన్‌దీప్ అనే ఇద్దరు ఉద్యోగులతో పాటు వారి కింద ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యోగులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల్లో సుభాష్, టీన్నూ మినహా మిగిలిన వారంతా ఔట్సోర్సింగ్ స్టాఫ్‌గా గుర్తించారు. నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, చాట్ హిస్టరీపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ రికార్డులు పూర్తిగా బయటపడితే ఈ స్కామ్‌లో మరికొంతమంది పెద్ద తలకాయల గుట్టు వీడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!