Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
- విపక్షాల ఆందోళనతో "పార్లమెంట్ కమిటీ"కి వక్ఫ్ బిల్లు..
- బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు..
- వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందన్న బీజేపీ..
- రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ కత్తెర వేసేందుకు, మిగిలిన కమ్యూనిటీలకు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు రాజ్యంగవ్యతిరేకమని, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ప్రతిపక్షాలకు కేంద్రం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ బిల్లు కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందించామని, వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని కేంద్రమంత్రి అన్నారు.
Read Also: Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)కి పంపబడింది. 1995 చట్టంలో సవరణలు చేస్తూ, ముస్లిం మహిళలను వక్ఫ్ బోర్డుల్లో చేర్చడం, ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే ముందు భూమిని ధృవీకరించడం వంటి ముఖ్యమైన మార్పులను కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.
లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పుడు వ్యక్తుల్ని ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించింది. ముస్లిం కాని వారిని వక్ఫ్ బోర్డులో నామినేట్ చేయడం ఏమిటి..? అని ప్రశ్నించింది. ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!