Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండాలు సీఎంను ఖరారు చేశారు. మొత్తం 90 అసెంబ్లీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ గెలిచింది. గతంలో విష్ణు దేవ్ సాయ్ కేంద్రమంత్రిగా పనిచేశారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం నిలుపుకోగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా కూడా ఇంకా సీఎంలను ఖరారు చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ఎన్నికయ్యారు.
విష్ణు దేవ్ సాయ్ గురించి కీలక విషయాలు:
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి విష్ణు దేవ్ సాయ్ గెలుపొందారు. 87,604 ఓట్లతో విజయం సాధించారు. గిరిజన వ్యక్తిని సీఎంగా బీజేపీ ఎన్నుకుంటే.. తొలి ఛాయిస్ విష్ణు దేవ్ సాయ్ అని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయననే సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. సాయ్ మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో ఉక్కు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 16వ లోక్‌సభలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు.
అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా విష్ణుదేవ్ నిలిచారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఛతీస్‌గఢ్‌ను మధ్యప్రదేశ్ నుండి వేరు చేయడానికి ముందు విష్ణు దేవ్ సాయి 1990-98 మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విష్ణు దేవ్ 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం విష్ణు దేవ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!