Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Visa Free Travel To Russia Key Talks Between Putin And Modi

Visa-Free Travel To Russia: భారతీయులకు శుభవార్త.. రష్యాకు వీసా ఫ్రీ ట్రావెల్

Published Date :September 17, 2022 , 5:48 pm
By venugopal reddy
Visa-Free Travel To Russia: భారతీయులకు శుభవార్త.. రష్యాకు వీసా ఫ్రీ  ట్రావెల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉజ్బెకిస్తాన్ లోని సమర్‌కండ్‌లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్( ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో భారతదేశం గొప్ప చరిత్ర, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయకంగా రష్యాకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీతో అన్నారు. ఈ నేపథ్యంలో వీసా ఫ్రీ ప్రయాణానికి సంబంధించిన ఒప్పందంపై చర్చల ప్రక్రియ వేగవంతం చేయాలని పుతిన్ ప్రతిపాదించారు.

Read Also: CM KCR : మోడీ మా జీవోను గౌరవిస్తావా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా..?

రష్యా, ఇండియా దశాబ్ధాలుగా కలిసి ఉన్నాయని.. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులును తరలించేందుకు సహకరించినందుకు పుతిన్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారు. దీనిపై మీ ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని.. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్, మోదీతో అన్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాత్రం రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుంది. రష్యాతో చమురుతో పాటు ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఆంక్షల మధ్య భారత్ తో రష్యా చేస్తున్న వాణిజ్యం ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. భారత్ మాత్రం తమ ప్రజల ప్రయోజనాలకే మొగ్గు చూపుతామని పలు సందర్భాల్లో చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • PM Narendra Modi
  • Putin
  • Russia
  • SCO Summit

తాజావార్తలు

  • HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..

  • Kantara Mimicry : యుద్దం కారణంగా చిక్కుకున్నా: రణ్‌వీర్ సింగ్

  • Mossad: ‘‘మొసాద్’’ వీరి పేరు వింటేనే శత్రువులకు హడల్.. ‘‘మ్యూనిచ్ ప్రతీకారమే’’ ఓ సాక్ష్యం..

  • Jobs Growth: ఏఐ, ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన నియామకాలు..

  • Holi 2026 Eye Safety Tips: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. హోలీ సమయంలో మీ కళ్లలో కలర్స్‌ పడితే.. వెంటనే ఇలా చేయండి..

ట్రెండింగ్‌

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions