Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లో ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల విల్లాలు, కాటేజీల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌ను ఏపీఓ (అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్స్)లో ఉంచగా, ఇప్పుడు ఆయన భార్య ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రశాఖ మాథూర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈమెను కూడా ఏపీలో కింద ఉంచాలని రాష్ట్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆస్తుల కొనుగోలు, లీజు ఒప్పందాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో శిఖర్ అగర్వాల్, ప్రశాఖ మాథూర్లు, వీరిద్దరి కుటుంబ సభ్యులు సుమారు రెండేళ్లలో ఉదయ్‌పూర్, అల్వార్ ప్రాంతాల్లో 40 విల్లాలు, కాటేజీలు కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ రూ. 6.16 కోట్లు(రూ. 61.61 మిలియన్లు) ఉంటుందని తెలుస్తోంది. 2023 సెప్టెంబర్‌లో ఉదయ్‌పూర్ లోని బుజ్రా ప్రాంతంలో ఉన్న అనంత రిసార్ట్‌లో 20 కాలేజీలను ఐఏఎస్-ఐపీఎస్ కుటుంబం కొనగోలు చేసింది. ఆ తర్వాత 2026 మార్చిలో అల్వార్ జిల్లాలో అజబ్‌గఢ్ లో ఉన్న అనంత రిసార్ట్‌లో మరో 20 విల్లాలు కొనుగోలు చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో ప్రాపర్టీలనున గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.
Also Read
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
- Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
కొన్న కంపెనీకే మళ్లీ లీజు..
ఈ వ్యవహారంలో ఏ కంపెనీ నుంచైతే వీటిని కొనుగోలు చేశారో, తిరిగి అదే కంపెనీకి లీజు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక్కో కాటేజీకి ఏడాదికి రూ.4 లక్షలు, అల్వార్‌లోని ఒక్కో విల్లాకు ఏడాదికి రూ.5 లక్షల లీజు మొత్తాన్ని నిర్ణయించారు. దీని ద్వారా కాటేజీల ద్వారా ఏడాదికి రూ. 80 లక్షలు, విల్లాల ద్వారా రూ. కోటి ఆదాయం వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మొత్తం 40 ఆస్తుల నుంచి రూ. 1.80 కోట్లు ఏడాది ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
కుటుంబీకుల పేరుతో రిజిస్ట్రేషన్లు..
ఈ ఆస్తుల్ని ఐఏఎష్ అధికారి శిఖర్ అగర్వాల్, ఐపీఎస్ అధికారి ప్రశాఖ మాథుర్, ఆమె తల్లి మంజుల, తండ్రి రఘువంశ్ నారాయణ్ మాథుర్ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రశాఖ మాథుర్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా తన ఇద్దరు కుమారుల పేర్లపైనా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కేసులో ఇద్దరు అధికారులు సమర్పించిన స్థిరాస్తి వివరాల ప్రకటన (Immovable Property Returns – IPR) కూడా పరిశీలనలోకి వచ్చింది. ఈ రిపోర్టులో శిఖర్ 2026లో సమర్పించిన ఆస్తుల్లో 14 ప్రాపర్టీల వివరాలు పేర్కొన్నారు. ప్రశాఖ మాథూర్ ఆస్తుల వివరాలు సున్నాగా చూపించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!