ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో భేటీ అయి బడ్జెట్ కూర్పుపై సూచలు, సలహాలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Madhya pradesh: పోలీస్‌స్టేషన్‌లో పెళ్లి దుస్తుల్లో గిరిజన యువకుడు మృతి.. భగ్గుమన్న కుటుంబ సభ్యులు
ఇదిలా ఉంటే ఈనెల 21న అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. పార్టీ ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో భేటీ జరగనుంది.
ఇది కూడా చదవండి: Bhukya Yashwant: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహకుడు..
ఇక పార్లమెంట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. గత ప్రత్యేక సమావేశాలు హాట్ హాట్ సాగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తారు. మరోసారి లోక్‌సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తు్న్నాయి. అలాగే రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కూడా ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. జరగబోయే సమావేశాలు హాట్ హాట్‌గానే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.