Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. అయితే, 2025-26 బడ్జెట్‌లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక, కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 రకాల ప్రాణ రక్షక టాబ్లెట్స్, వెట్ బ్లూ లెదర్, లిథియం బ్యాటరీలు ఉండగా.. స్మార్ట్ టీవీలు, మొబైల్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చౌకగా లభించనున్నాయి.
Read Also: New Income Tax Slabs: కొత్త ఆదాయపన్ను శ్లాబులు ఇవే.. ఇంత ఆదాయం ఉన్నవారికి బిగ్ రిలీఫ్!
1. ఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు
2. ఎల్‌ఈడీలు, ఎల్‌సీడీ
3. లిథియం బ్యాటరీలు స్క్రాప్
4. వెట్ బ్లూ లెదర్
5. కోబాల్ట్ ఉత్పత్తులు
6. 36 ప్రాణ రక్షక ఔషధాలు..
7. 12 క్లిష్టమైన ఖనిజాలు
8. జింక్
9. చేపల పేస్ట్‌పై సుంకం 30 నుంచి 5శాతానికి తగ్గింపు
10. స్మార్ట్ టీవీలు, మొబైల్‌లు