Celebi: మాకు టర్కీతో సంబంధాలు లేవు.. భారత్ నిర్ణయంపై కోర్టుకెక్కిన సెలెబి..
- ‘‘మాకు టర్కీతో సంబంధాలు లేవు’’..
- కేంద్రం నిర్ణయంపై టర్కీ విమానయాన సంస్థ సెలెబి..
- ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సెలెబి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్‌కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్‌కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్‌పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని వ్యాపారులు బ్యాన్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఇదిలా ఉంటే, భారతదేశంలోని 9 ఎయిర్ పోర్టు్ల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలు అందిస్తున్న టర్కీ విమానయాన సంస్థ అయిన సెలెబి కి భారత్ అనుమతుల్ని రద్దు చేసింది. “జాతీయ భద్రత దృష్ట్యా” భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
Read Also: PAK Beggars: బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్.. 5 వేల మందిని వెనక్కి పంపిన సౌదీ..
అయితే, ఈ నిర్ణయంపై సెలెబి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేసింది. శుక్రవారం, సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ, అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను హేతుబద్ధంగా ఉదహరించారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక తెలిపింది. కేంద్రం నిర్ణయాన్ని పక్కన పెట్టాలని కోరుతూ.. ఇది 3,791 ఉద్యోగాలను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని కూడా పేర్కొంది.
గురువారం, కేంద్రం ప్రకటనకు స్పందించిన సెలెబీ, ‘‘తమది టర్కిష్ సంస్థ కాదని, ఏ విదేశీ ప్రభుత్వంతోనూ సంబంధాలు లేవని పేర్కొంది. సెలెబి వ్యాపారం నిజంగా భారతీయ సంస్థ అని, దీనిని భారతీయ నిపుణులు నడిపిస్తారని, మేము ఏ ప్రమాణాల ప్రకారం చూసినా టర్కిష్ సంస్థ కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడిన కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత పద్ధతులకు కట్టుబడి ఉన్నాము. ఏ విదేశీ ప్రభుత్వం లేదా వ్యక్తులతో ఎలాంటి ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేదా సంబంధాలు లేవు’’ అని ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..
-
Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
-
Kanchana 4: కాంచన – 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
-
Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!