India Pak War: సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలోని పలు నగరాలను, ప్రజల ఇళ్లను టార్గెట్ చేస్తూ వరసగా రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, ఈ దాడిలో పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. భయంకరమైన భూకంప సమయంలో మానవతా దృక్పథంలో భారత్ టర్కీకి సాయం చేసినా, ఆ దేశం మాత్రం పాకిస్తాన్‌కి సహకరిస్తూ వస్తోంది.
తాజాగా, గురువారం జరిగిన డ్రోన్ దాడిలో పాక్ 300-400 టర్కీ డ్రోన్‌లను ఉపయోగించినట్లు భారత అధికారులు తెలిపారు. లడఖ్‌లోని లేహ్ నుండి గుజరాత్‌లోని సర్ క్రీక్ వరకు మొత్తం పశ్చిమ సరిహద్దులో 36 ప్రదేశాలలో భారత గగనతలంలో బహుళ చొరబాట్లు కల్నర్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కూల్చివేసిన డ్రోన్ శిథిలాలను పరిశీలించి, వాటిని టర్కీకి చెందిన ‘ఆసిస్ గార్డ్ సోంగర్’ డ్రోన్లుగా తేల్చారు.
Read Also: IMF: పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం.. భారత్ హెచ్చరికలు బేఖాతరు..
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతిలో 26 మంది చనిపోయినా, టర్కీ కనీస సంతాప సందేశాన్ని కూడా పంపలేదు. బదులుగా పాక్‌కి పూర్తి మద్దతు ఇస్తోంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు. కాశ్మీర్‌పై టర్కీ మద్దతుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచం మొత్తం ఈ దాడిని ఖండిస్తూ, భారత్‌కి సంతాపం తెలియజేస్తే టర్కీ మాత్రం పాకిస్తాన్‌కి సైనిక సాయాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇటీవల టర్కీకి చెందిన 6 విమానాలు భారీగా ఆయుధాలు, సైనిక పరికారాలను పాకిస్తాన్‌కి అందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపల్ని టర్కీ ఖండించింది. తమ కార్గో విమానం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాక్‌లో దిగినట్లు చెప్పింది. మరోవైపు, టర్కీ తన ఓడని కరాచీలో ఉంచింది. గతేడాది పాక్ టర్కీ నుంచి 5.16 బిలియన్ డాలర్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసింది.
ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత, పాక్ మద్దతుగా భారత చర్యని టర్కీ ఖండిస్తూ ప్రకటన వెలువరించింది. అయితే, పాక్ ప్రయోగించిన టర్కీ డ్రోన్ల ద్వారా భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థని పరీక్షించడానికి, నిఘా సేకరించడానికి కావచ్చని మన రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, పాక్‌కి చైనా తర్వాత టర్కీ గట్టి మద్దతుదారుగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. టర్కీ పాకిస్తాన్‌కి దాని బేరక్తర్ TB2 , అకిన్సి డ్రోన్‌లను అందిస్తోంది. నేవీకి సంబంధించిన ఆస్తులను కూడా పాక్ కి అందిస్తోంది.