Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
- బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు..
- వైద్యురాలి అత్యాచార..హత్య ఘటనపై రాజకీయాలు..
- బీజేపీ..సీపీఎంపై విరుచుకుపడిన సీఎం మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ కేసులోని నిందితులతో టీఎంసీ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది.
ఈ ఘటన బీజేపీ, సీపీఎంలు ‘‘చౌకబారు రాజకీయాలకు’’ పాల్పడుతున్నాయని సీఎం మమతా బెనర్జీ బుధవారం ఫైర్ అయ్యారు. ‘‘బాధిత మహిళ కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి రెండు పార్టీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ పరిస్థితులు తీసుకురావాలని వారు భావిస్తున్నారు. అయితే తాను అధికారం కోసం అత్యాశతో లేను’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
Read Also: Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
రాత్రంతా ఈ కేసుని పర్యవేక్షించానని, నేరం గురించి తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌తో పాటు మహిళ తల్లిదండ్రులతో మాట్లాడానని ఆమె చెప్పారు. మేం ఏం చర్యలు తీసుకోలేదు..? అని ఆమె ప్రశ్నించారు. అత్యాచారంలో నిందితుడిని ఉరిశిక్ష విధించేలా చేస్తామని మహిళ తల్లిదండ్రులతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. లేడీ డాక్టర్ అంత్యక్రియాలు జరిగే వరకు పోలీసులతో తాను టచ్‌లో ఉన్నానని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ఎస్కార్ట్ చేశారని, నిందితుడిని పోలీసులు 12 గంటల్లో అరెస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
‘‘పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజ్, ఇతన పరీక్షలు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. 12 గంటల్లోనే హంతకుడిని అరెస్ట్ చేశాం’’ అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని కేసుని సీబీఐకి అప్పగించింది. ‘‘ఏదైనా విచారణ కోసం మీరు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు గడువు విధించాను. సరైన విచారణ లేకుండా మీరు ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌవిస్తాను. సరైన విచాణ లేకుండా నేను వ్యక్తుల్ని అరెస్టు చేయలేను’’ అని ఆమె అన్నారు. తాము పూర్తిగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి సీబీఐకి సహకరిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!