ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా ద్వారా బట్ట బయలు చేయడం అభినందనీయమన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రశంసించారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తీసిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా నిజాన్ని ధైర్యంగా బయటపెట్టిందని అన్నారు.
The Sabarmati Report: గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు.
విక్రాంత్ మాస్సే 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రం నవంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రాంత్ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అతడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. జర్నలిస్ట్ ఈ హీరోకు బీజేపీ, ముస్లింలు, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.